మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: కవిత

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి:  కవిత

NZB: రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ట్వీట్ చేశారు.