ఈదమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
NGKL: కొల్లాపూర్ ఈదమ్మ జాతర చివరి వారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు బోనాలు, నైవేద్యాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గత వారం సూర్యగ్రహణం కారణంగా ఆలయం మూసివేయగా, నేడు పూజారులు 'నెల పూజ' నిర్వహించడంతో జాతర ముగియనుంది. మున్సిపల్ సిబ్బంది భక్తుల కోసం తాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు కల్పించారు.