VIDEO: అలుగు పారుతున్న లక్ష్మాపూర్ చెరువు

VIDEO: అలుగు పారుతున్న లక్ష్మాపూర్ చెరువు

MDCL: శామీర్ పేట్ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి లక్ష్మాపూర్ చెరువు అలుగు పారుతుంది. ఉద్దమర్రి, అలియాబాద్ గ్రామాల మధ్య బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కేవలం భారీ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.