'విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

'విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

MNCL: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తమను తాము రక్షించుకోగలరని చెన్నూరు సీఐ బన్సీలాల్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. పోక్సో, మత్తు పదార్థాల నియంత్రణ లాంటి కీలక చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. అపరిచితులతో స్నేహం చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.