ధవళేశ్వరానికి తగ్గుముఖం పట్టిన గోదావరి వరద

E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో శనివారం ఉదయం 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 13.20 అడుగులు నీటిమట్టం కొనసాగుతుంది. బ్యారేజీ నుంచి 11.95 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే మూడు పంట కాలువలు ద్వారా 12600 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు.