VIDEO: బేతంచెర్లలో కుక్కల దాడి.. 181 నాటు కోళ్లు మృతి
NDL: బేతంచెర్ల హనుమాన్ నగర్‌లోని పోలకంఠ సుజాత అనే మహిళ నాటు కోళ్ల ఫారం నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే, గత రాత్రి కోళ్ల ఫారంలోకి కుక్కలు ప్రవేశించి, 181 నాటు కోళ్లను చంపేశాయని ఆమె పేర్కొంది. దీంతో సుమారు రూ. 2.50 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితురాలు వాపోయింది. తనకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతోంది.