ఎరువుల దుకాణాల తనిఖీ చేసిన DAO

RR: మొయినాబాద్ మండల పరిధిలోని ఎరువుల దుకాణాలను బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి ఉష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీలర్లు ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువకు ఎరువులు అమ్మవద్దని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు, బిల్ బుక్స్, స్టాక్ ధరల ప్రదర్శన బోర్డులను పరిశీలించారు.