'కుష్టు వ్యాధిపై భయపడాల్సిన పనిలేదు'
ప్రకాశం: మార్కాపురం మండలం వేములకోటలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర కేంద్రంలో ఇవాళ కుష్టి వ్యాధి నివారణ కార్యక్రమాన్ని DPMO శ్రీనివాసరావు నిర్వహించారు. కుష్టి వ్యాధి లక్షణాలు గ్రహించి తగిన చికిత్స అందిస్తే వ్యాధి నయమవుతుందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఉచితంగా మల్టీ డ్రగ్ థెరఫీ మందులు అందిస్తుందని శ్రీనివాసరావు వెల్లడించారు.