విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!
SDPT: చిన్నకోడూరు మండలం విఠలాపూర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వయంపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బోధనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రధానం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశికుమార్, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.