అల్లూరులో ముగిసిన వరి కోతలు
NLR: అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారంతో వరి కోతలు ముగిశాయి. మండలం వ్యాప్తంగా దాదాపుగా 25వేల ఎకరాల్లో రైతన్నలు వరి సాగు చేస్తూ ఉంటారు. రెండవ కారుకు సంబంధించిన పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. మండలంలోని పలు ప్రాంతాల్లో రైతన్నలు వరితోపాటు, బీరకాయ, సొరకాయ, చిక్కుడు వంటి పంటలను పండిస్తారు. సోమశిల జలాశయం నుంచి ఈ ప్రాంతానికి సాగు నీరు వస్తుంది.