నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :SP
అన్నమయ్య: బాణాసంచా విక్రయించే గోదాముల నిర్వాహకులు నిబంధనలో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా SP ధీరజ్ శుక్రవారం హెచ్చరించారు. నిబంధనను తప్పక పాటించాలని,ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు పోలీసు అధికారులు ముందస్తు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాణాసంచా తయారీ విక్రయించే దుకాణాలు గోదాములకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అన్నారు.