నేడు మండలంలో పర్యటించనున్న స్పీకర్
VKB: తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ఈ రోజు మోమిన్‌పేట్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నంది వాగు ప్రాజెక్టులో మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేపపిల్లలను చెరువులో వదులుతారు. తర్వాత రైతు వేదికలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారు. చక్రంపల్లి, దేవరంపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.