ఈనెల 15తో ముగియనున్న గడువు
HYD: 2026-27 ఏడాదికి జిల్లాలో 35 గురుకుల జూనియర్ కాలేజీలలో, 93 KGBVలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. చివరి తేదీ ఏప్రిల్ 15 కాగా, పరీక్ష మే 3న జరగనుంది. ఇప్పటి వరకు 45 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. https://tgrjc.cgg.gov.in/ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం 7842991708, 18004252428 నంబర్లను సంప్రదించండి.