VIDEO: తుంగభద్ర నదికి భారీగా వరద

GDWL: కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, అలాగే తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేసిన నీటితో తుంగభద్ర నది నిండుకుండలా మారింది. రాజోలి మండలం, సుంకేసుల బ్యారేజీ నుంచి శనివారం 34 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఉండవెల్లి మండలంలోని కలుగొట్ల, పుల్లూరు వంటి గ్రామాల సమీపంలో నది ఉధృతంగా ప్రవహిస్తుంది.