ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
NZB: ప్రజల ఆర్థిక బలోపేతం లక్ష్యంగా ఎడపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఎఫ్ఎల్ కౌన్సిలర్ పవన్ కుమార్, ఎస్‌బీఐ మేనేజర్ సునీల్, అసిస్టెంట్ మేనేజర్ ఉమేష్ హాజరయ్యారు. అధికారులు ప్రజలకు, మహిళలకు ఆర్థిక విషయాలపై, ముఖ్యంగా బీమా పథకాలపై పూర్తి అవగాహన కల్పించారు.