అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

KDP: అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం పట్టుకున్నట్లు సిద్దవటం ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. పెన్నా నది నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తుండడంతో ట్రాక్టర్లను బెటాలియన్ వద్ద ఆపినట్లు తెలిపారు. వారి వద్ద ఇసుకకు సంబంధించిన ఎలాంటి బిల్లులు లేకపోవడంతో రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసామన్నారు.