ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. వెంటనే ఇరాన్ సైనికులు, రివల్యూషనరీ గార్డ్స్ ఆయుధాలను వీడాలని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌ను తిరిగి దక్కించుకోవడానికి ఇదే సరైన తరుణమని సూచించారు. తన మాట వినకుంటే యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు. యుద్ధంలో మరణించడం తప్ప ఏమీ మిగలదని పేర్కొన్నారు.