ఓటు హక్కు వినియోగించిన కలెక్టర్ దంపతులు
జనగామ జిల్లాలోని సెయింట్ మేరీస్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డాక్టర్ సయ్యద్ అమ్రిన్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.