యాక్సిడెంట్ స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

యాక్సిడెంట్ స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

SKLM: కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్ స్థలాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొన్న దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, ఆరుగురు తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే. ప్రమాదానికి గల కారణాలను స్థానిక డీఎస్పీ సీఐ ఎస్సైలకు అడిగి తెలుసుకున్నారు.