గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
GNTR: ఇంటూరు-పొన్నూరు మార్గం మధ్యలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.