అరకులో భగ్గుమన్న కూటమి.. అంబటి దిష్టిబొమ్మ దహనం

అరకులో భగ్గుమన్న కూటమి.. అంబటి దిష్టిబొమ్మ దహనం

ASR: అరకులో ఆదివారం కూటమి శ్రేణులు భగ్గుమన్నాయి. సియ్యారి దొన్ను దొర ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి బూతులు, లోకేష్‌పై జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం పోయాక కూడా వైసీపీ నేతలు పశువుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.