శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి: శ్రీ కోదండ రామాలయంలో ఆగష్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. 1వ తేదీ పవిత్ర సమర్పణ. 2వ తేదీ పవిత్రోత్సవాలు ముగింపు. 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. 3న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది.