ఖర్గేను కలిసిన వైసీపీ ఎంపీ

AP: YCP రాజ్యసభ MP మేడా రఘునాథరెడ్డి కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి మద్దతిస్తామని YCP ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయేనని మేడా క్లారిటీ ఇచ్చారు. ఇదివరకే ఖర్గేతో ఉన్న పరిచయం మేరకే ఇప్పుడు కలిశానన్నారు. మిత్రుడిలా కలిశానని, దీనిపై అత్యుత్సాహం చూపాల్సిన అవసరం లేదన్నారు.