VIDEO: కడియంలో అలరించిన కోలాటం

E.G: వినాయక చవితి సందర్భంగా కడియం పోస్ట్ ఆఫీస్ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన కోలాట నృత్యం అలరించింది. ఈ సందర్భంగా చిన్నారులు లయబద్ధంగా పాటలకు అనుగుణంగా కోలాట నృత్యం ప్రదర్శించారు. ఏకరూప దుస్తులతో కోలాట నృత్య ప్రదర్శన సాగింది. నృత్యకారిణులు, నిర్వాహకులను పలువురు అభినందించారు.