పేరుపాలెం బీచ్‌లో యువకుడి గల్లంతు

పేరుపాలెం బీచ్‌లో యువకుడి గల్లంతు

W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం బీటెక్ సెకండియర్ స్టూడెంట్ మునగాల గణేశ్ (19) గల్లంతయ్యాడు. తన స్నేహితులతో కలిసి బీచకు వచ్చి సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న మొగల్తూరు ఎస్సై జి.వాసు, అంతర్వేది మైరెన్ ఎస్సై సోమశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.