'గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలి'
AKP: గ్రామాల్లో వైసీపీ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎలమంచిలి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ విజ్ఞప్తి చేశారు. గురువారం కొత్తలి, రేగుపాలెం, కొత్తూరు గ్రామాల్లో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.