18న అచ్చంపేటకు ముఖ్యమంత్రి రాక

NGKL: ఈనెల 18వ తేదీన అచ్చంపేటకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్టు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వెల్లడించారు. శనివారం మన్ననూరు అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 12,600 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారని తెలిపారు.