మంచినీటి కోసం బిందెలతో నిరసన

MBNR: చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో శనివారం గ్రామపంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాము మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా మిషన్ భగీరథ కొళాయిల ద్వారా మంచినీరు సరఫరా కాకపోవడంతో సమీపంలోని బోరు బావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు.