ప్రభుత్వ ఐటీఐలో ఖాళీలకు ఆహ్వానం

SKLM: శ్రీకాకుళంలోని బలగ ప్రభుత్వ ఐటీఐలో 3వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్‌రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26లోగా https://iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 27న ధ్రువపత్రాలు వెరిఫికేషన్‌తో పాటుగా 29న తమ కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మహిళలకు టైలరింగ్ కోర్సుల్లో కూడా ఖాళీలు ఉన్నాయని తెలిపారు.