ఉపాధి ఫిర్యాదు పై విచారణ

SKLM: ఆమదాలవలస మండలం పొన్నంపేటలో ఉపాధి హామీ పనుల నిర్వహణపై సోమవారం అధికారులు కూలీల సమక్షంలో విచారణ చేపట్టారు. జాబ్ కార్డుల్లో అవకతవకలు ఉన్నాయని ఇటీవల గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినట్లు ఏపీడీ లోకేష్ తెలిపారు. ఉపాధి కూలీలు తెలిపిన సమాచారాన్ని జిల్లా అధికారులకు వెల్లడించి తదుపరి చర్యలు తీసుకుంటానన్నారు.