జహీరాబాద్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
SRD: పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ రాజు మాట్లాడుతూ.. ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఉపకార వేతనాలు విడుదల చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.