పిల్లలు బరువు తగ్గకుండా చూడాలి: సీడీపీఓ

VZM: అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు బరువు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీలపై ఉందని ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలో బుధవారం అంగన్వాడీ కేంద్రాలలో ఈసీసీఈ దినోత్సవం నిర్వహించారు. అంగన్వాడీ పిల్లల బరువు చూసి బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించారు. పిల్లలలో అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు.