VIDEO: ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ
NZB: ఎడపల్లి మండలం జానకంపేట మహిళా సమాఖ్య భవనంలో సోమవారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఈ చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ చీరలు పంపిణీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.