రేపు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ సమావేశం

VZM: కొత్తవలస మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం కొత్తవలస మండల ఎంపీపీ నీలం శెట్టి గోపమ్మ ఆధ్వర్యంలో రేపు జరగనున్నట్లు పీహెచ్‌సీ వైద్య అధికారిని డాక్టర్ సీతల్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొంటారని తెలిపారు.