చికెన్ దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు

NDL: ఆళ్లగడ్డ లో చికెన్ దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆళ్లగడ్డలోని ఐదు చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు. ఆ దుకాణాల నుంచి చికెన్ శాంపిల్స్‌ను తీసుకొని హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.