ముగిసిన వెంకటగిరి జాతర.. వెళ్లిరా పోలేరమ్మా..!

TPT: వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ముగిసింది. పొలి చల్లడం పూర్తి అయ్యాక ఊరేగింపునకు సిద్ధం చేశారు. పూల రథంపై అమ్మవారిని ఉంచి సాయంత్రం 5 గంటలు దాటాక నగరోత్సవం ప్రారంభించారు. ఆర్చి సెంటర్ నుంచి రాజావారి వీధి, కాశీపేట, శివాలయం మీదుగా మల్లమ్మ గుడి వీధిలోని విరూపణ మండపం వరకు ఊరేగింపు జరిగింది. వెళ్లి రా పోలేరమ్మా అంటూ భక్తులు ఘన వీడ్కోలు పలికారు.