తొర్రూరు నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు
MHBD: పంచారామాల దర్శనం కోసం తొర్రూరు నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ పద్మావతి తెలిపారు. నవంబర్ 3న బస్సు బయలుదేరి తిరిగి 6న తొర్రూరుకు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.2,200 టికెట్ ధర నిర్ణయించినట్లు సూచించారు. టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు 8074474984, 9959226053 నంబర్లలో సంప్రదించాలన్నారు.