ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తాం
SRPT: సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య, విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు.