ఈనెల 19న చిత్తూరులో ఉద్యోగ మేళా

ఈనెల 19న చిత్తూరులో ఉద్యోగ మేళా

CTR: మూడుప్రైవేటు కంపెనీల్లో ఖాళీల భర్తీ నిమిత్తం ఈనెల 19న చిత్తూరులో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి పద్మజ తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే ఈ మేళాలో 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు పాల్గొనవచ్చని ఆమె సూచించారు.టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్న వారు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.