సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు ఆదోని విద్యార్థిని ఎంపిక

సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు ఆదోని విద్యార్థిని ఎంపిక

KRNL: ఆదోని విద్యార్థిని మేఘనా రెడ్డి సౌత్‌ జోన్ బాలికల క్రికెట్ జట్టులో ఎంపిక కావడం ఆనందదాయకమని ఆదోని తాలూకా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ముజీబ్ హమ్మద్ తెలిపారు. గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెకు సన్మానం చేశారు. ఈ నెల 13 నుంచి 19 వరకు నెల్లూరులో జరిగే సౌత్‌ జోన్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.