కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి: కమిషనర్
NZB: మున్సిపల్ కార్మికులందరూ వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, ఏ కార్మికుడు కూడా అనారోగ్యానికి గురి కావద్దని NZB మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు.