బైక్‌ను ఢీ కొట్టిన ఆటో.. ఇద్దరికీ గాయాలు

బైక్‌ను ఢీ కొట్టిన ఆటో.. ఇద్దరికీ గాయాలు

WNP: ఆటో బైక్‌ను ఢీకొనడంతో తండ్రి, కూతురు గాయపడ్డ ఘటన రేవల్లి మండలం చెన్నారం గ్రామ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పాలు సరఫరాచేసే ఆటో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో అనంతపురం గ్రామానికి చెందిన బోయ రాములుతో పాటు అతని కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.