'విద్యార్థులు చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి'
కోనసీమ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ సినీ నటులు, రచయిత తనికెళ్ల భరణి సూచించారు. ఆలమూరు మండలం చెముడులంక స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలకు విద్యార్థులను దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.