ఎమ్మెల్యే నేటి కార్యక్రమ వివరాలివే
NDL: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం డోన్‌లోని పాతపేట పూల మార్కెట్ సమీపంలో గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 9:30 గంటలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తారని టీడీపీ మండల నాయకులు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.