పెదబయలులో భిన్న వాతావరణం.. ఆశ్చర్యంలో ప్రజలు
ASR: పెదబయలు మండలంలో భిన్న వాతావరణం నమోదవుతోంది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ తీవ్రత, సాయంత్రం భారీ వర్షం కురుస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఆదివారం ఉదయం అరడకోట నుంచి జిల్లా కేంద్రం పాడేరు వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు హెడ్‌లైట్ల సహాయంతో ప్రయాణాలు సాగించారు. వేసవి ప్రారంభంలో కనిపిస్తున్న ఈ పొగమంచు దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు.