అర్హులైన వారికి ఆసరా పెన్షన్లు ఇవ్వాలి: CPM

NLG: గత నాలుగు సంవత్సరాలుగా దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న అర్హత కలిగిన ఆసరా పెన్షన్ దారులందరికీ వెంటనే మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం డిమాండ్ చేశారు. ఇవాళ సీపీఎం నల్గొండ పట్టణ సెంటర్ బాధ్యుల సమావేశం సుందరయ్య భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికైనా అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు.