సబ్ జైలును సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్

సబ్ జైలును సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్

JN: జనగామ సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ సి.విక్రమ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాది లేని వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. జైలులో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామని తెలిపారు. లీగల్ ఎయిడ్ సేవలను ఖైదీలు వినియోగించుకోవాలని సూచించారు.