'ప్రజలకు ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం'

NRPT: మక్తల్ నియోజకవర్గ ప్రజలకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందించడమే తన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో 150 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం వేగవంతంగా జరపాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.