మొబైల్ IMEI నంబర్ మార్చితే మూడేళ్ల జైలు
మొబైల్ ఫోన్ల ప్రత్యేక గుర్తింపు సంఖ్య 15 అంకెల IMEI నంబర్‌ను ట్యాంపరింగ్ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇకపై IMEI నంబర్‌ను మార్చితే నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణించనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ (DoT) స్పష్టం చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించనున్నట్లు హెచ్చరించింది.