ప్రజావాణి ఫిర్యాదుపై విచారణ

ప్రజావాణి ఫిర్యాదుపై విచారణ

KMR: బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో ప్రజావాణి ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన దాసరి బాలరాజు తన భూమిని అదే గ్రామానికి చెందిన బాలనర్సు కబ్జా చేశారని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు పంపామన్నారు.